Bigg Boss Telugu 5 Episode 10 Analysis: Siri Hanmanth Allegations on VJ Sunny

Image Credits : Star Maa

#BiggBosstelugu5
#SiriHanmanth
#VJSunny
#BiggBosselimination
#PriyankaSingh
#AnchorRavi
#Shannu
#RJKajal

బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం ఎవరూ ఊహించని గొడవలతో ప్రారంభమైంది. ప్రతి వారం కెప్టెన్సీ పోటీ దారుల కోసం టాస్కులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రెండో వారానికి సంబంధించి కెప్టెన్సీ కోసం పోటీ పడే వారిని ఎంపిక చేయడానికి ‘పంతం నీదా నాదా' అనే టాస్కును మొదలు పెట్టారు. ఇందులో మొదటి రౌండ్‌లో భాగంగా కంటెస్టెంట్లతో ‘దొంగలున్నారు జాగ్రత్త' అనే గేమ్‌ను ఆడించారు. ఇందుకోసం వాళ్లను నామినేషన్స్ టాస్కులో విడగొట్టిగనట్లుగానే రెండు టీమ్‌లుగా ఉంచారు. ఇందులో భాగంగా ‘పిల్లో'లను ఎక్కువ సంపాదించిన జట్టే గెలిచినట్లు అని చెప్పారు. దీంతో వాటి కోసం కంటెస్టెంట్లు బాగా కష్టపడ్డారు.